ఇటీల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌పై నేతల్లో నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.జగన్ దెబ్బకు టీడీపీ నాయకులకు ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నారు.ఇక చంద్రబాబు విషయానికి వస్తే మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మే ఈ విమర్శలేంటి చంద్రబాబు గారూ. మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు. జగన్ గారు అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని శోకాలు పెడుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు కు చుక్కలు చూపించాడు.పెట్టుబడులు తెస్తానని చంద్రబాబు 38 దేశాలు తిరిగొచ్చారు. 39 కోట్ల ప్రజాధనం ఖర్చయింది. ఇంతకూ ఏం తెచ్చారని అడిగితే 16 లక్షల కోట్లకు ఒప్పందాలు చేసుకొని వచ్చారట. వాస్తవానికి వంద కోట్లు కూడా రాలేదు. 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ఇంకా అవే అబద్ధాలు వల్లిస్తున్నారని అన్నారు.
కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాకముందే విషం చిమ్మే ఈ విమర్శలేంటి చంద్రబాబు గారూ. మీ దుర్మార్గాలను అడ్డుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు. జగన్ గారు అమరావతికి ప్రాధాన్యతనివ్వడం లేదని శోకాలు పెడుతున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకి బాగా తెలుసు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 16, 2019