Home / 18+ / టీమిండియా కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ

టీమిండియా కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ

టీమిండియా హెడ్ కోచ్, హెల్పింగ్ డిపార్ట్ మెంట్ కు దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. ఇందులో భాగంగా ప్రధాన కోచ్ తో పాటు బ్యాటింగ్ , ఫీల్డింగ్ , బౌలింగ్ , స్ట్రెంగ్త్ అండ్  కండీషనింగ్  కోచ్  లను, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్  మేనేజర్లను తిరిగి అపాయింట్  చేసుకోనున్నారు. అయితే ఈసారి కొత్తగా వయసు, అనుభవం నిబంధనలను కూడా తీసుకొచ్చారు. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు 60 ఏళ్ల వయసు మించొద్దని షరతు పెట్టారు. ఆసక్తి ఉన్నవాళ్లు జులై 30 సాయంత్రం ఐదింటిలోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు బీసీసీఐ అధికారులు. ప్రసెంట్ కంటిన్యూ అవుతున్న కోచింగ్ డిపార్ట్ మెంట్ కు నియామకాల ప్రక్రియలో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందని తెలిపింది బీసీసీఐ.

హెడ్ కోచ్ రవిశాస్త్రిని నియమించక ముందు 2017 జులైలో కోచ్ ల ఎంపికకు 9 రూల్స్ పెట్టింది బీసీసీఐ. అయితే వాటిపై దృష్టి పెట్ట‍కపోగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈసారి అలా కాకుండా అన్ని పోస్టులకు కేవలం మూడు రూల్స్ మాత్రమే పెట్టింది. హెడ్ కోచ్ అభ్యర్థి… టెస్టు హోదా ఉన్న దేశానికి కనీసం రెండేళ్లు కోచ్ గా చేసుండాలి. లేదా అసోసియేట్  సభ్యదేశానికైనా, టీమ్-ఏ జట్టుకుగానీ, ఐపీఎల్ జట్టుకు కానీ మూడేళ్లు కోచ్ గా ఉండాలి. అలాగే కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడుండాలి. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్  కోచ్ లకూ కూడా ఇవే రూల్సే వర్తిస్తాయి.  ఆడిన మ్యాచ్ ల సంఖ్యను మాత్రం తగ్గించారు. వీళ్లు 10 టెస్టులు లేదా 25 వన్డేలు ఆడుంటే సరిపోతుంది. వయసు మాత్రం 60 మించొద్దు.

ప్రస్తుతమున్న హెడ్  కోచ్  రవిశాస్త్రి, బౌలింగ్  కోచ్  భరత్  అరుణ్ , బ్యాటింగ్  కోచ్  సంజయ్  బంగర్ , ఫీల్డింగ్  కోచ్  శ్రీధర్ లకు ప్రపంచకప్  ముగిసే నాటికి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్  సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని వీరికి 45 రోజుల గడువు పెంచింది బీసీసీఐ. వీరంతా కొత్త కోచ్ డిపార్ట్ మెంట్ లోనే చేరే అవకాశం ఉంది. కానీ ఫిజియో ప్యాట్రిక్, స్ట్రెంగ్త్ అండ్  కండీషనింగ్ కోచ్ శంకర్ బసు ఇప్పటికే వెళ్లిపోయారు. వీరి స్థానాల్లో మాత్రం కొత్తవారు వస్తారు.

60 ఏళ్ల నిబంధన కోచ్ రవిశాస్త్రి కొంపముంచేలా ఉంది. ప్రస్తుతం ఈయనకు 57 ఏళ్లు. ఒకవేళ శాస్త్రిని మళ్లీ ఎంపిక చేస్తే 2023 వరల్డ్ కప్ వరకు కంటిన్యూ చేస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 2017లో టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి బాధ్యలు తీసుకున్నాడు. ఈయన రెండేళ్ల పర్యవేక్షణలో ఉన్న ఇండియా ప్రపంచకప్ మాత్రం సాధించలేకపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat