టీడీపీపై అసెంబ్లీలో మరింత దూకుడుగా వెళ్లాలని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈమేరకు పలు విషయాల్లో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రతి సభ్యుడూ ఏ సమయానికి వచ్చారు.. ఏ సమయానికి వెళుతున్నారనే అంశంపై దృష్టి పెట్టాలని చీఫ్ విప్‌కి జగన్ సూచించారు. ఈ వివరాలతో ప్రతిరోజూ సాయంత్రం తనకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో చేస్తున్న విమర్శలు చేస్తున్న సమయంలో ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండం లేదని జగన్ భావించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల హాజరుపై జిల్లా మంత్రులకి ఆయన బాధ్యత అప్పగించారు.
