ఈనెల 21 న స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. 14 మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు ఈ షోలో పాల్గొంటున్నట్లు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరించబోతున్నా అక్కినేని నాగార్జున ఇప్పటికే ఒక ప్రోమో ద్వారా తెలిపారు. అయితే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల్లో టీవీ9 ఛానెల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే జాఫర్ పాల్గొనబొతున్నట్లు సమాచారం. అలాగే వీ6 ఛానెల్లో తీన్మార్ వార్తలతో మంచి పేరు తెచ్చుకున్న తీన్మార్ సావిత్రి కూడా ఈ షోలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ షో కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేసిందట. హీరో వెంకటేష్ నటించిన మల్లీశ్వరి, మహేష్ బాబు అతడు, అల్లు అర్ఝున్ జులాయి సినిమాల్లో నటించిన హేమ కూడా ఈ షోలో పాల్గొంటుందట. యాంకర్ శ్రీముఖి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటుందట. ఈ షోలొ పాల్గొనటం కోసం ఈమెకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారని తెలుస్తుంది. సీరియల్స్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించే జాకీ , యువ హీరో వరుణ్ సందేశ్ అతని భార్య ఇద్దరూ ఈ షోలో ఉండబోతున్నారట. గత రెండు సీజన్లలో లేని విధంగా ఈసారి భార్యా భర్తలిద్దరికీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళు కాక సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కనిపించిన అమ్మాయి , శతమానం భవతి ఫేమ్ హిమజ. సుడిగాలి సుధీర్,రేణు దేశాయ్ ఈ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.
