వైసీపీ పెద్దాపురం నాయకురాలు తోట వాణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడంతో దానిపై ఆమె స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. తప్పుడు అఫివిడవిట్‌తో చినరాజప్ప ఎన్నికల సంఘాన్ని మోసం చేశారని తోటవాణి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే
