తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ యాదవ్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఎంపీ బండ ప్రకాశ్ మాట్లాడుతూ..కేంద్రం పెద్ద పెద్ద విమానాశ్రయాల అభివృద్ధిపైనే దృష్టి పెడుతోందని, రాష్ట్రాల్లో మినీ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరారు. మామునూర్, ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తే భూములు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.