ఇటీల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌పై నేతల్లో నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నేతలు వివిధ పార్టీల్లో చేరుతున్నారు. దీంతో ఆ పార్టీ మనగడే ప్రశ్నార్థకం అయిపోయింది. ఇదే విషయంలో తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అనే పార్టీ భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. నేరాలకు నిలయంగా మారిపోయిన టీడీపీ కేవలం తానా సభలలో మాత్రమే మిగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు .
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రామ్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపీలోని అత్యధిక ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించేట్లు చూడాలని రామ్ మాధవ్ విఙ్ఞప్తి చేశారు. ఏపీలో అధికార పార్టీ దిశగా 2024 నాటికి బీజేపీ ఎదగాలని సూచించారు. సభ్యత్వ నమోదులో భాగంగా ఐదు వారాల వ్యవధిలో రాష్ట్ర నాయకత్వం కొత్త సభ్యుల చేరికను చేపట్టాలని, ఒక్కో కార్యకర్త స్వయంగా 25 మంది కొత్త సభ్యులకు సభ్యత్వం ఇప్పించాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలోకి వచ్చేవారికి సూచలను చేశారు. తమ పార్టీ ఏ కూలానికి, వర్గానికి, మతానికి కొమ్ముకాయదని రామ్ మాధవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దారుణంగా తయారైందన్నారు రామ్ మాధవ్. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సెటైర్ వేశారు.