తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగలా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఊరువాడా పల్లెపల్లెన జోరుగా హుషారుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈ నెల ఇరవై తారీఖునే చివరి గడవు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుండి ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు,కార్యకర్తలు,నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని వర్గాల వారి నుండి సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. గత నెల జూన్ ఇరవై ఏడో తారీఖున ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో లక్ష్యాన్ని మించి పార్టీ సభ్యత్వం జరగడం గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది..