Home / BHAKTHI / బుుషికేష్‌లో దరువు ఎండీ కరణ్ రెడ్డికి స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు…!

బుుషికేష్‌లో దరువు ఎండీ కరణ్ రెడ్డికి స్వామి స్వరూపానందేంద్ర ఆశీస్సులు…!

శ్రీ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చాతుర్మాస్య దీక్ష నిమిత్తం బుుషికేష్‌‌‌‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి బాలస్వామి కూడా స్వామిజీతో కలిసి చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు.ఈనెల 16 నుండి సెప్టెంబర్ 14 వరకు దాదాపు రెండు నెలల పాటు శారదాపీఠాధిపతి చాతుర్మాస్య దీక్షను పాటించనున్నారు. దీక్ష నిమిత్తం ఈ నెల 5 వ తేదీనే స్వామిజీ బుుషికేష్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. 5వ తేదీ నుంచి స్వామిజీలు ఇద్దరు..బుుషికేష్ అడవుల ప్రాంతంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. గిరిజనులకు దుప్పట్లు, వస్త్రాలు పంచారు. గిరిజనులు భారతీయతకు మూలపురుషులు అని, గిరిజనుల్లో ధార్మిక చైతన్యం పెంచుతామని ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. సామాజిక సేవే కాకుండా బుుషికేష్, హరిద్వారాలో గిరిజన ప్రాంతాల్లో బురదలో తిరుగుతూ స్వామిజీలు ఇద్దరు ధర్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా చాతుర్మాస్య దీక్ష నిమిత్తం బుుషికేష్‌కు వెళుతున్నట్లు, ఆశీర్వవచనాల నిమిత్తం ఎవరూ విశాఖకు రావద్దు అని స్వామి స్వరూపానందేంద్ర ప్రకటన చేసిన సంగతి విదితమే. స్వామిజీ బుుషికేష్‌లో ఉండడంతో పలువురు ప్రముఖులు అక్కడకు వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు.

తాజాగా చాతుర్మాస్య దీక్షను పురస్కరించుకుని స్వామిజీకి పట్టు వస్త్రాలు సమర్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బుుషికేష్‌కు వెళ్లిన తెలంగాణ కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు తదితరులు తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పాటు దరువు ఎండీ సిహెచ్ కరణ్ రెడ్డి కూడా బుుషికేష్‌లో మహాస్వామి వారి దర్శనం చేసుకున్నారు. స్వామీజీ దర్శనార్థం బుుషికేష్‌కు చేరుకున్న కరణ్ రెడ్డి ముందుగా పవిత్ర గంగానదిలో పుణ్య స్థానం ఆచరించారు. తదనంతరం శ్రీ స్వరూపానంద మహాస్వామి వారిని దర్శించుని ఆశీర్వాదం పొందారు. పవిత్ర బుుషికేష్ క్షేత్రంలో స్వామీజీ ఆశీర్వాదం పొందడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా దరువు ఎండీ కరణ్ రెడ్డి అన్నారు. చాతుర్మాస్య దీక్ష సందర్భంగా దేశం నలుమూలల నుంచి సాధువులు, పండితుల రాకతో బుుషికేష్ క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat