ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయింది.నిన్న అర్ధరాత్రి తరవుత దీనిని అంతరిక్షంలోకి పంపాలని అనుకోగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని నిలిపివేశారు.మల్లా ఎప్పుడు ప్రయోగిస్తారు అనేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.ఈ మేరకు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త బి.జి.సిద్ధార్థని మాట్లాడుతూ ఇలాంటి విషయాలు అప్పట్లో అమెరికా, రష్యాలో కూడా జరిగాయని తెలిపారు.రాకెట్ లో చిన్న చిన్న లీక్ లు ఉన్నాయని.ఈ మేరకు విశ్లేషణ జరుగుతుందని అన్నారు.ఈ ప్రయోగానికి మరికొన్ని వారాలు పట్టొచ్చని ఆయన అన్నారు.
