తెలంగాణలో నిర్మిచనున్న సరికొత్త సచివాలయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పర్యావరణహితంగా నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత సచివాలయ భవనాలు 25
ఎకరాల విస్తీర్ణంలో అస్తవ్యస్తంగా ఉన్నందున కొత్త సమీకృత సచివాలయ భవనాలను తక్కువ స్థలంలోనే క్రమపద్ధతిలో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలన్నింటినీ కేవలం ఐదెకరాల్లోనే చేపట్టి మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఉద్యాన వనాలు, వాటర్ ఫౌంటేన్లు ఏర్పాటుచేయనున్నారు. నగరంలోనే అతిపెద్ద అర్బన్ పార్కు ఇక్కడ ఆవిర్భవించనున్నది. ఈ మేరకు నూతన సచివాలయ నమూనాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
