Home / ANDHRAPRADESH / కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు అంటూ బుద్దాపై కేశినేని నాని ట్వీట్

కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు అంటూ బుద్దాపై కేశినేని నాని ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పలువురు నేతలు పార్టీని వీడుతుండగా.. మరోవైపు పార్టీలోని సీనియర్‌ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్‌ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి బుద్దా కూడా కౌంటర్‌ ఇచ్చారు.

సోమవారం మరోసారి కేశినేని ట్విటర్‌ వేదికగా బుద్దా మరోసారి కౌంటర్‌ ఇచ్చారు.రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరిచిప్ప దొంగలకు, సైకిల్‌ బెల్లుల దొంగలకు, కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు, పైరవీదారులకు అవసరమని.. తనకు అవసరం లేదని ఘాటుగా ట్వీట్‌ చేశారు. మరోపక్క టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు గారు.. నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం. నాలాంటి వాళ్లు పార్టీలో ఉండాలంటే.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చేయండి’ కేశినేని ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే కేశినేని ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది తెలియాల్సి ఉంది. నిన్నపార్టీ నాయకులపై విమర్శలకు పరిమితమైన కేశినేని.. నేడు చంద్రబాబును హెచ్చరించే రీతిలో వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat