ఎవరైనా విజయాల్లో రికార్డు సృష్టిస్తారు. అవార్డుల్లో రికార్డు సృష్టిస్తారు. అద్భుతాల్లో రికార్డు సృష్టిస్తారు. ఒక రాజకీయ నాయకుడు మాత్రం, అపజయాల్లో సరికొత్త చరిత్ర తిరగరాశాడు. అసలు తాను పోటీ చేసేది ఓడిపోయేదే అన్నట్టుగా వరుసగా ఐదుసార్లు ఓడిపోయారు. ఈ ఎడాది ఎప్రిల్ నెలలో జరిగిన ఎన్నికల్లో కూడా తన దశాబ్దాల సాంప్రదాయం ఏమాత్రం తప్పకుండా ఓడిపోయారు. వరుసగా ఓడిపోవడానికి ఆయన సీపీఐ, సీపీఐం పార్టీ కాదు, సాదాసీదా లీడరూ కాదు. దశాబ్దాల పాటు పాలన సాగించిన పార్టీలో ఆయన మోస్ట్ సీనియర్. పట్టువదలకుండా, ఓటమి దండయాత్ర చేస్తున్న ఆ గజినీ మొహమ్మద్ ఎవరు అనుకుంటున్నారా..ఆయనే మన నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో రాజకీయ ఆరంగేట్రం చేసి గెలిచారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వరుసగా 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత ఆయనకు ఇక గెలుపు అనేది లేదు. 1999 అంటే మూడోసారి పోటీతో ఆయన పరాజయాల ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత పొరపాటున కూడా ఆయన విజయాల ట్రాక్ పట్టలేదు. 1999 తరువాత, ఆయన్ను రాజకీయ దురదృష్టం వెంటాడుతోంది. పోటి చేసిన ప్రతి ఎన్నికలోనూ ఆయన ఓటమిని చవిచూస్తూ వచ్చారు. ఒకటికాదు, రెండుకాదు వరుసగా ఐదుసార్లు ఓటమి. అంటే రెండు దశాబ్దాలుగా సోమిరెడ్డిని ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఓటమి వెంటాడుతూనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత అనూహ్యంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా, 2014 ఎన్నికల తరువాత ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయిన తరువాత, 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అవ్వడంతో ఇక మళ్లీ సోమిరెడ్డి గురించి ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ఈ ఐదేళ్లు ప్రతిపక్షహోదాలో సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళుతూ, తన వారసుడి రాజకీయ భవితవ్యాన్ని ఆయన తీర్చిదిద్దుతారా లేక సోమిరెడ్డితోనే ఆ కుటుంబం నుంచి రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే తెలియాల్సింది.
