ప్రపంచకప్ లో భాగంగా నిన్న ఆతిధ్య ఇంగ్లాండ్,న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి ఇంగ్లాండ్ నే గెలిచింది.అయితే ఈ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ పెట్టగా ఇంగ్లాండ్ మొదట 15 పరుగులు చేయగా అనంతరం చేసింగ్ కు దిగిన బ్లాక్ కేప్స్ కూడా 15రన్స్ నే చేసారు.అయితే బౌండరీలు ఆధారంగా ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు అనుకూలంగా ప్రకటించారు.సూపర్ ఓవర్ లో సిక్స్ కొట్టిన న్యూజిలాండ్ ప్లేయర్ నీషమ్ మాత్రం ఒక ఆసక్తికరమైన ట్విట్ చేసాడు.‘కిడ్స్.. స్పోర్ట్స్ జోలికి వెళ్లకండి.. లైట్ తీస్కోండి హ్యాపీ గా ఇంట్లో పెట్టింది తినేసి 60ఏళ్ళు బ్రతికేయండి చాలు అంటూ ట్వీట్ చేసాడు.ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతుంది.అంతేకాకుండా మాజీ క్రికెటర్స్ యువరాజ్, బ్రెట్‌లీ కూడా ఈ రూల్ ను తప్పుబట్టారు.సూపర్ ఓవర్ లో కూడా డ్రా అయినప్పుడు.వికెట్లు చూడాలని ఎందుకంటే ఇంగ్లాండ్ అల్లౌట్ అయ్యిందని కొంతమంది అభిప్రాయపడ్డారు.