విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వాఖ్యలు చేశారు. కేశినేని ప్రైవేటు బస్ ల పేరుతో మోసాలు చేశారని , బస్సుల మీద ఫైనాన్స్ తీసుకుని.. 1997లో సొంతంగా దొంగ రసీదులు తయారు చేసి దొంగ ముద్ర వేసుకుని.. కోట్లాది రూపాయలు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్లు చేసేది అని ఓ రెంజ్ లో బెద్దా వెంకన్న ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. దళిత నాయకుడు, మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒకే నంబరుపై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి.. వినే ధైర్యం నీకుందా? చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే.. అతడినే అనరాని మాటలని ఆ పార్టీని కూల్చావు. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మనిస్తే ఇవాళ ఆయన గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి మీద నేనో.. నువ్వో.. ఎవరు పోరాడుతున్నారనేది ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు. ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చే ముందు ఆడిన ఆటలు.. ఈ పార్టీలో సాగవు అన్నారు.
