ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీలేదు.ఎందుకంటే దొంగ హామీలు ఇచ్చి చివరికి గెలిచిన తరువాత ప్రజలను నట్టేట ముంచేసాడు.ప్రజల సొమ్ము కొన్ని వేలకోట్లు వృధా చేసాడు.తాను సీఎంగా ఉంటూ తన సొంత ప్రయోజనాలకే అన్ని వాడుకున్నాడు తప్ప రాష్ట్రానికి మాత్రం ఏమి చేసిందిలేదు.అయితే ఈరోజు మొదలైన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసారు.ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చేసినట్టుగా ఏ సీఎం విదేశీ పర్యటనలు చేయలేదని.చంద్రబాబు పర్యటనలో ఒక ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదని ఆయన అన్నారు.
అనంతపురం కు వచ్చిన కియా మోటార్స్ కూడా చంద్రబాబు తెచ్చింది కాదని ఈ విషయాన్నీ స్వయంగా ఆ సంస్థ సీఈఓ జగన్ కు లేఖ రాసారని.అందులో 2007 మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రంలో పెట్టాలని కోరారని అందుకే ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం జరిగిందని తెలిపారు.దీంతో చంద్రబాబుకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యిందనే చెప్పాలి.ఇప్పటివరకు కియా మొత్తం నావల్లనే స్టార్ట్ అయ్యింది చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఒక్కసారిగా గుండెల్లో రైళ్ళు పరిగెట్టాయి.