వరంగల్ లోని శివనగర్ లోని పద్మశాళి కమ్యూనిటి హాల్ లో నవ తెలంగాణా దివ్యాంగుల సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా వారి ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,దివ్యాంగుల అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి,కార్పోరేటర్ శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్…ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు ప్రజలకు సేవచేసే అవకాశం దక్కింది,వారికి రుణపడి ఉంటాను.దివ్యాంగులు నాకు కుటుంబసభ్యులే మీకు సేవ చేయడం సంతోషంగా ఉందన్నారు.దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే బాద్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను.డబుల్ బెడ్ రూం ఇళ్ళలో దివ్యాంగులకు ప్రాదాన్యత ఇవ్వనున్నాం..అన్ని రంగాల్లో దివ్యాంగులకు 5శాతం వాటా అందిస్తామన్నారు.తూర్పు నియోజకవర్గంలో దివ్యాంగుల స్థితిగతులపై అంచనాకు వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందే విదంగా కృషిచేద్దామన్నారు.దివ్యాంగులకు సంబందించిన పథకాలు అందరికి తెలిసేలా కృషిచేద్దాం.
సకలజనుల సర్వే లాగా నియోజకవర్గంలో దివ్యాంగుల కోసం సర్వే నిర్వహించి అందరికి సంక్షేమఫలాలు అందేవిదంగా కృషిచేస్తానన్నారు.దివ్యాంగుల సంక్షేమ భవనం కోసం స్థలం కేటాయించేందుకు కృషిచేస్తాం.దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి.చైర్మన్ సహాకారంతో అందరికి అవి అందజేస్తాం.దివ్యాంగులకు 3వేల రూపాయల పించన్ అందజేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.ఉద్యొగ ఉపాది మార్గాలలో దివ్యాంగులకు సహాయ సహాకారాలు అందిస్తానన్నారు.మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా వచ్చి తెలియజేయండి.వాటిని పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.దివ్యాంగులకు ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.ప్రతీ పేదభిడ్డ ఆత్మగౌరవంతో బ్రతకాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.వారి ఆచరణలో మీ సేవకై పనిచేస్తాం.వంద సంవత్సరాలైనా టీఆర్ఎస్ బలంగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎండి అజమ్, కమిటీ జిల్లా అద్యక్షుడు బండి చక్రపాణి,ఉపాద్యక్షులు జిల్లా రమేష్,ఊరుకొండ అశోక్,ఇప్ప శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి అంబటి రాజేందర్,కోశాదికారి గోపరాజు యాదయ్య,మహిళా కార్యదర్శులు యస్.విజయలక్ష్మి,అట్లూరి వాణి,పెద్దోజు రాదిక కార్యవర్గ సభ్యులు రచ్చ శ్రీదర్ ,బోడకుంట్ల విజయ్ కుమార్,కనుకుంట్ల శ్రీకాంత్,రమేష్,సాదిక్,వేణు,హెచ్ శ్రీనివాస్,స్థానిక నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.