ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయారు.అయితే ఈ ఓటమిని ఇప్పటికీ అభిమానులు అంగీకరించలేకపోతున్నారు.ఈ ఓటమి కారణంగా ఇప్పుడు జట్టు సెలక్షన్ కమిటీ,కోచ్, కెప్టెన్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవ్తున్నాయి.ఇక అసలు విషయానికి వస్తే భారత్ జట్టు ఈ వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా భరిలోకి దిగింది.అయితే లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి అసలు కారణం ఏమిటి అని ఆలోచిస్తే ప్రతీఒక్కరి నోటా వచ్చేది నాలుగవ స్థానం కోసమే. 2017లో యువరాజ్ సింగ్ తో మొదలైన ఈ ప్రస్తానం ఇప్పటికీ లోటుగానే ఉంది.యవరాజ్ సింగ్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్,మనిష పండే, కే ఎల్ రాహుల్, ఇలా చాలా మందికి ఆ స్థానంలో ప్రయోగించారు.
చివరకు ఈ వరల్డ్ కప్ లో ఆ స్థానాన్ని రాహుల్ కి ఇచ్చారు.అయితే ధావన్ గాయం కారణంగా వైదొలగడంతో ఓపెనర్ గా రాహుల్ వచ్చాడు.ఇక గాయం కారణంగా మరో ఆటగాడు విజయ్ టోర్నీకి దూరం కావడంతో అతడి ప్లేస్ లో రాయుడుకి ఛాన్స్ ఉండగా అతడిని దెబ్బతీసి అగర్వాల్ కు ఛాన్స్ ఇవ్వడంతో, తన కెరీర్ ను అక్కడితో ముగుంచాడు రాయుడు.ఇంక ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు భారత్ కోచ్ రావిశాస్త్రి మాత్రం నాలుగో స్థానం ఇంక వెలితిగానే ఉందని స్టేట్మెంట్ ఇవ్వడం పై విమర్శలు వస్తున్నాయి.ఈ మేరకు బోర్డు కు రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ బోర్డుకు సమాధానం చెప్పాల్సిందే.