ఆంధ్రప్రదేశ్ లో APSSDC ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు కియా మరియు అనుభంద సంస్థల్లో ఉద్యోగాలకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. డిప్లొమా/పాలిటెక్నిక్ చదివిన యువతకు ఏది ఒక మంచి అవకాశమని చెప్పాలి.ఇందులో ఎంట్రీలెవల్ పొజిషన్‌కుగానూ ఈనెల 19న జేఎన్‌టీయూ సీమెన్స్ సెంటర్ బ్లాక్‌లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తున్నామని ఆ సంస్థ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.ఇంకా దీనికి అప్లై చేసే అభ్యర్ధులు అనంతపురం జిల్లా వాసులై ఉండాలి మరియు డిప్లొమా/పాలిటెక్నిక్ చదివి ఉండాలి.జిల్లలో ఉన్న ప్రతీ విద్యార్ధి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేసారు.ఇంకా ఇతర విషయాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకునేవాలు 9398643930, 7658902296 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
