గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలపై అభాండాలు వేయడం మానేసి ఆ ఇంటర్వ్యూకు వెళ్లిరావాలని మాజీమంత్రి నారాలోకేశ్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్షనేత విజయసాయి రెడ్డి సూచించారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ.. ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలని చురకలింటించారు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదని మండిపడ్డారు. ఆదివారం ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
