ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అనడరికి తెలిసిందే.అధికార పార్టీ ఐన టీడీపీ ఫ్యాన్ గాలికి ఇక్కడ నిలబడలేకపోయింది. ఐదేళ్ళ అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు కాని చివరికి అప్పులు మాత్రమే మిగిల్చింది.2014లో చేసిన తప్పు మల్ల చేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు.అందుకే ఈ ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు సరైన బుద్ధి చెప్పారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రికార్డు మెజారిటీతో గెలిపించారు.ఈ మేరకు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విరిచుకుపడ్డారు.
ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలు అంటూ చంద్రబాబు, లోకేష్ ను ఒక ఆట ఆడుకున్నారు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదే అని ఎద్దేవా చేసారు. అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబు గారికి బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే. లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్ళకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి అని ప్రశ్నించారు.
ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీది. గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నావు. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2019
అమరావతి శంకుస్థాపనకే 300 కోట్లు నాకేసిన చంద్రబాబు గారికి బడ్జెట్లో 500 కోట్ల కేటాయింపు చాలా చిన్నదిగా అనిపించడం సహజమే. లక్ష కోట్లతో రాజధాని అంటూ మాయాబజారును కళ్ళకు కట్టారు. రాజధాని పేరుతో లెక్కలేనన్ని విదేశీ పర్యటనలు చేశారు. విదేశీ బృందాలతో గ్రాఫిక్స్ ప్రదర్శనలు తప్ప చేసిందేమిటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 14, 2019