అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.’రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. రైతన్నల పట్ల తనకున్న ఆపేక్షను జగన్ గారు ఈ బీమా స్కీమ్‌తో కనబర్చారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం నిశ్చింతగా జీవించడానికి ఇది భరోసా కల్పిస్తుంది’ అని అన్నారు.తండ్రికి తగ్గ తనయుడు అని మరోసారి జగన్ నిరూపించుకున్నాడు.ఇలాంటి బడ్జెట్ ఇప్పటివరకు ఏ నాయకుడు తీసుకురాలేదని ఆయన అన్నారు.
రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. రైతన్నల పట్ల తనకున్న ఆపేక్షను జగన్ గారు ఈ బీమా స్కీమ్‌తో కనబర్చారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం నిశ్చింతగా జీవించడానికి ఇది భరోసా కల్పిస్తుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 13, 2019