అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది. వడ్డీ లేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచి పోతాయి అని అన్నారు. జగన్ గారు రైతులకిచ్చిన మాట నిలుపుకున్నారని అన్నారు.
తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది. వడ్డీ లేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచి పోతాయి. జగన్ గారు రైతులకిచ్చిన మాట నిలుపుకున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 13, 2019