టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోని రానున్న రోజులలో రాజకీయాల్లోకి రానున్నాడా..?. వస్తే బీజేపీలో చేరనున్నాడా..? అంటే అవుననే అంటున్నారు. ఇలా అంటుందేవరో కాదు ఏకంగా కేంద్ర మాజీమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ . తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ టీంలో ధోని పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడే సమయం ఆసన్నమైందని తెలిపాడు. కొన్నాళ్ళుగా ధోనితో బీజేపీ పలు చర్చలు జరుపుతుంది. క్రికెట్‌కి రిటైర్మెంట్ తర్వాత ధోని బీజేపిలో చేరేలా కసరత్తులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ధోని ప్రపంచ దిగ్గజ ఆటగాడు. మంచి వికెట్ కీపర్‌తో పాటు బ్యాట్స్‌మెన్‌గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆయన నాకు మంచి స్నేహితుడు. ధోని బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చే విషయం గురించి పూర్తి సమాచారం ఆయన రిటైర్మెంట్ తర్వాత తెలుస్తుంది అని పాశ్వాన్ వెల్లడించారు. ఈ ఏడాది ధోని సొంత రాష్ట్రం జార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ స్కెచ్‌లు వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చూడాలి మరి భవిష్యత్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో..!