తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అనంతరం మాట్లాడుతూ మంత్రి ఈటల రాజేందర్ కూలిపోయే బంగ్లాలు ఇరుకు .ఇరుకు ఆసుపత్రులుగా ఉండే అలాంటి సందర్భాలలో నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హుజురాబాద్ నియోజవర్గంలో 6 ఆస్పత్రులను నిర్మించడం జరిగింది .ఇంకా మంత్రి మాట్లాడుతూ నేను పడ్డ బాధలు. కష్టాలను నా ప్రజలు పడకూడదనే ఇంత చక్కటి ఆస్పత్రిని కట్టించడం జరిగింది .ప్రజా శ్రేయస్సుకోసం అనేక రకాల కార్యక్రమాలు చేసి దేశంలో నెంబర్ వన్ గా నిలుస్తున్న అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వివిధ శాఖ అధికారులు. సర్పంచులు. ఎంపీటీసీలు జడ్పీటీసీలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
