రోహిత్ శర్మ:
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ లో తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో కొనసాగాడు.ఈ టోర్నీలో 5శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు.ఈ టోర్నీలో అత్యధిక పరుగులు(648) చేసిన ఆటగాడిగా నిలిచాడు.
డేవిడ్ వార్నర్:
ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ గత ఏడాది బాల్ టాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేదానికి గురయ్యాడు.అనంతరం ఈ వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇచ్చి మంచి ఆటను కనబరచాడు.ఈ టోర్నీలో 647 పరుగులు చేసి రెండవ ఆటగాడిగా నిలిచాడు.
కేన్ విలియమ్సన్:
ఈ ప్రపంచకప్ లో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరిందంటే దానికి ముఖ్య కారణం కేన్ విలియమ్సన్ అని చెప్పాలి.ప్రతి మ్యాచ్ లో ఓపెనర్స్ విఫలం అవుతున్న ఒంటిచేత్తో టీమ్ ను ముందుకు నడిపించాడు.ఈ టోర్నిలో ఇప్పటివరకు విలియమ్సన్ 91.33 సగటుతో 548 పరుగులు చేసాడు.
షకిబ్‌అల్‌హసన్:
ప్రపంచకప్ లో షకిబ్ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడని చెప్పాలి.ఆ జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్ లో ఇతడే ముఖ్య పాత్ర.ఈ టోర్నీలో 606 పరుగులు మరియు 11వికెట్స్ కూడా తీసాడు.
జోరూట్:
ఇంగ్లాండ్ తరపున ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ రూట్ నే.రెండు శతకాలు, మూడు అర్ధశతకాలతో జట్టుని ముందుండి నడిపించి ఫైనల్ కు చేర్చిన ఘనత రూట్ దే.ఈ టోర్నీలో ఇప్పటివరకు 549 పరుగులు సాధించాడు.
మిచెల్‌స్టార్క్:
ఈ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా సెమీస్ వరకు రావడానికి ఒకే ఒక్క కారణం మిచెల్‌స్టార్క్.తన పదునైన యోర్కేర్స్ తో ఎంతటి ప్లేయర్ నైన పెవిలియన్ కి పంపేవాడు.ఈ టోర్నీలో 27వికెట్లు తీసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం ఈ భారత్ బౌలర్ ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్.తన యోర్కేర్స్ తో బాట్స్ మెన్ కు చుక్కుల చూపించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి.ఈ టోర్నిలో జస్ ప్రీత్ బుమ్రా 18వికెట్లు తీసాడు.అంతేకాకుండా ఎక్కువ మైడెన్స్ కూడా చేసాడు.
లుకీ ఫెర్గుసన్:
న్యూజిలాండ్ ఫైనల్ కి చేరడంలో మరో కీలక పాత్ర బౌలర్ లుకీ ఫెర్గుసన్.బాట్స్ మాన్ లు చేతులెత్తేసిన ఈ బౌలర్ అండతో ఆ జట్టు ఫైనల్ కు చేరింది.ఈ టోర్నీలో లుకీ ఫెర్గుసన్ 18వికెట్లు తీసాడు.