ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి ప్రవేశపెట్టారు.
బడ్జెట్‌లో కేటాయింపులు ఇవీ…
మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు
రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు
బడ్జెట్ అంచనా-19.32శాతం పెరుగుదల
రెవెన్యూ వ్యయం-20.10శాతం పెరుగుతందని అంచనా
కేటాయింపుల్లో దేనికెంత..!?
రాజధాని అమరావతికి రూ.500 కోట్లు
విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందం కోసం అదనంగా రూ.2 వేల కోట్లు చెల్లిస్తోంది
ఇంధన రంగంలో గత ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్లు రుణంగా వచ్చింది
సాగునీటి శాఖకు 13,139 కోట్లు
వైఎస్‌ఆర్ రైతు భరోసాకు 8750 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు
ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు
వైఎస్‌ఆర్ 9గంటల ఉచిత విద్యుత్‌కు 4525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు
విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు
ఫసల్ బీయా యోజనకు రూ.1163 కోట్లు
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ రూ.475 కోట్లు
వైఎస్ బోర్ వెల్‌పథకానికి రూ.200 కోట్లు
విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు
అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు
స్కూళ్లలో మౌలికవసతులకు రూ.1500 కోట్లు
మధ్యాహ్న భోజనానికి రూ.1077 కోట్లు
వైఎస్‌ఆర్ స్కూల్ మెయింటనెన్స్ గ్రాంట్ రూ.160 కోట్లు
ఆరోగ్యశ్రీ రూ.1740 కోట్లు
ఆస్పత్రుల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు
ఆశావర్కర్ల గౌరవవేతనం 456 కోట్లు
వైఎస్‌ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజి- రూ.66 కోట్లు
గురజాల ప్రభుత్వ మెడికల్ కాలేజి -66 కోట్లు
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజి -66 కోట్లు
శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పతికి 50 కోట్లు
వైఎస్‌ఆర్ గృహవసతికి రూ 5వేల కోట్లు
పట్టణాల్లో ప్రధాని ఆవాస్ యోజనకు రూ.1370 కోట్లు
బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు
వైఎస్‌ఆర్ అర్భన్ హౌసింగ్‌కు వెయ్యి కోట్లు