తిరుమల తిరుపతి దేవస్థానముల తిరుమల ప్రత్యేకాధికారిగా ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల ఇన్‌చార్జ్ జెఈఓ పి.బసంత్ కుమార్ రంగ నాయకుల మండపంలో తిరుమల ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. అనంతరం ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని ఎవి.ధర్మారెడ్డి కి అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తిరుమల ప్రత్యేకాధికారి మీడియాతో మాట్లాడుతూ.. 3 వ సారి శ్రీవారి సేవ చేసే అవకాశం కలగడం పుర్వజన్మ పుణ్యఫలమన్నారు. శ్రీవారి ఆశీస్సులు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి సంతఅప్తికరంగా శ్రీవారి దర్శనం, సౌకర్యాలు కల్పించేందుకు కఅషి చేస్తామన్నారు.
