రోజురోజుకు వాతావరణంలో ఉష్షోగ్రతలు పెరిగి పోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. మానవ మనుగడే దుర్లభంగా మారుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే ఈ అనర్థానికి ప్రధానమైన కారణం. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు, భూ భాగంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణకు హరితహారం అనే పవిత్ర యజ్ఞం చేపట్టారు. విరివిగా చెట్లు పెంచటమే లక్ష్యంగా సాగే ఈ బృహత్తర ప్రయత్నంలో నేను త్రికరణ శుద్దితో క్రియాశీలకంగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తోటి ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో ఈ యేడాది నేను వెయ్యి మొక్కలు నాటుతానని, వాటిని పరిరక్షించి, చెట్లుగా ఎదిగేవరకు బాధ్యత తీసుకుంటానని ప్రతిన పూనుతున్నాను. తెలంగాణను హరిత తెలంగాణగా మార్చే ఈ మహాసంకల్పంలో నేను ఓ హరిత సైనికుడిగా సాగుతానని శపథం చేస్తున్నాను అని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు సిద్దిపేట జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో,ప్రజలతో,కార్యకర్తలతో,నేతలతో ప్రతిజ్ఞ చేయించారు..