మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని శుక్రవారం నాడు బంజరాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మోజీ టీవీ స్టూడియోలో తనను అవమానించారని దళిత నేత హమారా ప్రసాద్ పెట్టిన కేసులో రేవతి ఏ2 గా ఉన్నారు. ఈ కేసు విషయమై తాము ఇచ్చిన నోటీసులకు రేవతి స్పందించలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. రేవతి ఇంటికి పోలీసులు వచ్చారు. ఎలాంటి వారంట్, నోటీసులు లేకుండానే తనను పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు చెబుతున్నారని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
