కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం క్షణానికోక విధంగా అనూహ్యంగా మారుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం చుట్టిముట్టిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక వ్యూహాత్మక ప్రకటన చేశారు. తన ప్రభుత్వంపై విశ్వాస తీర్మానానికి కుమారస్వామి సిద్ధమయ్యారు.దీంతో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమని కుమారస్వామి ప్రకటించారు. అందులో భాగంగా బీజేపీ తేరుకోకముందే విశ్వాసాన్ని నిరూపించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.మరి దీనికి స్పీకర్ సమయం ఎప్పుడు కేటాయిస్తారనే విషయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
