తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురును తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రంలో గురుకులాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి సర్కారు పచ్చ జెండా ఊపింది. దీంతో రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఉన్న 1698ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతులు జారీ చేసింది. గురుకులాల్లో ఉన్న 1071 టీజీటీ,119పీఈటీతో పాటుగా ముప్పై ఆరు ప్రిన్సిపల్ సహా పలు ఇతర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నియామకాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
