మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు పోలీసులకు పులివెందుల కోర్టు అనుమతినిచ్చింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే స్వయంగా ఈ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయిస్తున్నారు.ఖచ్చితంగా హంతకులను పట్టుకుంటారని,ఈ మేరకు అటు ప్రతిపక్షాలు కూడా భయపడుతున్నాయని తెలుస్తుంది.శుక్రవారం రాత్రి పులివెందుల పోలీసులు గంగిరెడ్డిని హైద్రాబాద్‌కు తరలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరికి ఈ పరీక్షలకు కోర్టు అనుమతిని ఇచ్చింది.వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వాచ్మెన్ రంగయ్య, ఈ కేసులో అనుమానితుడు శేఖర్ రెడ్డిలకు నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. గంగిరెడ్డికి కూడా ఈ టెస్ట్ కు అనుమతి ఇవ్వడంతో ఈ కేసులో నార్కో టెస్ట్‌కు అనుమతి ఇచ్చిన వారి సంఖ్య ముగ్గురికి చేరుకొంది.