Home / 18+ / ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతో ప్రేమాయణం సాగించాం.. ఇప్పుడు తాళి కట్టించుకున సంసారం చేస్తాం..

ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతో ప్రేమాయణం సాగించాం.. ఇప్పుడు తాళి కట్టించుకున సంసారం చేస్తాం..

త్వరలోనే తమపార్టీ బిజెపిలో విలీనమవుతుందని తెలుగుదేశంపార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బీజెపితో తాళి కట్టించుకుంటామని, బీజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కొత్తగా బీజేపీతో జతకట్టడంలేదని, గత ఐదేళ్ల టీడీపీపాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామనన్నారు. ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందన్నారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వతమిత్రులు ఉండరని ఆయనన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన నేపథ్యంలోజేసీ ప్రభాకర్‌రెడ్డి ఈవ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. జెసి బ్రదర్స్ కు కూడా బిజెపి నుంచి ఆహ్వానం ఉందన్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat