మాజీ మంత్రి నారా లోకేశ్.. ట్వట్టర్ వేదికగా ఇటీవల ఒక్క అంశంపై తప్ప అనేక విషయాలపై రెచ్చిపోతున్నారు.. రాష్ట్రంలోని అన్ని అంశాలపై పైకి మాట్లాడలేని లోకేశ్ ట్విట్టర్ లో మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. కరకట్ట మీద నివాసం ఉంటున్న తన అక్రమనిర్మాణంపై మాత్రం లోకేశ్ మాట్లాడడం లేదు. తనతండ్రి చంద్రబాబుతో పాటు తానుకూడా నివాసం ఉంటున్న లింగమనేని అక్రమ నిర్మాణంపై పెద్ద రచ్చే జరిగింది మరి కొద్దిరోజుల్లో ఆ ఇంటిని కూల్చేయనున్నారు కూడా.. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఆయన చేసిన తప్పిదాలన్నింటినీ జగన్ ప్రభుత్వ ఖాతాలో వేయటానికి లోకేశ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తాముంటున్న అక్రమనిర్మాణం గురించి మాత్రం మాట్లాడటం లేదు.. అయితే కరకట్టపై తాముంటున్న నిర్మాణం ఎవరిదో కూడా స్పష్టంగా చెప్పలేని స్ధితిలో పడిపోయారు తండ్రి.. అయితే ఈ విషయంపై మాత్రం లోకేశ్ గనుక మాట్లాడితే ఏ నిజాలు చెప్పేస్తాడో లేదా మళ్లీ ఏ గొడవ తెచ్చి పెడతాడో అనే భయంతో తండ్రి కొడుకును ఈ అక్రమనిర్మాణం గురించి, అదే లింగమనేనికి సబంధించిన సదరు గెస్ట్ హౌస్ గురించి మాట్లాడొద్దని చెప్పారట.
ప్రస్తుత ప్రభుత్వం దాదాపుగా కూల్చే నిర్ణయానికి వచ్చేసినట్లే.. తాజాగా ప్రజావేదికనే కూల్చేసిన ప్రభుత్వం ప్రైవేటు నిర్మాణాన్ని ఎందుకు ఉపేక్షేస్తుంది అనేది నిజం.. తాజాగా ఆ గెస్ట్ హౌస్ ప్రైవేటు ప్రాపర్టీ అని చెబుతున్న చంద్రబాబు అనుచరులు 2016లో మాత్రం అసెంబ్లీ ఆగెస్ట్ హౌస్ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకున్నట్లు చెప్పారు. మళ్లీ చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే గెస్ట్ హౌస్ పై కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక అంశాలపై ట్విట్టర్లో స్పందిస్తున్న లోకేష్ దీనిపై కూడా నోరిప్పితే బాగుంటుందనేది వైసీపీ శ్రేణుల వాదన..