ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసికట్టుగా ఉండడం అవసరమని,అప్పుడే రాష్ట్రాల మధ్య అనుభంధం మంచిగా ఉంటుందని,దీనివల్ల రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.గోదావరి నీరు శ్రీశైలం లోకి తేవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఉపయోగపడడమే కాకుండా అటు ఏపీలోని రాయలసీమ,ప్రకాశం,నెల్లూరు,జిల్లాలకు ఉపయోగం జరిగి, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని జగన్ చెప్పుకొచ్చారు. ఇలాంటి పనులపై ప్రతిపక్షం దిక్కుమాలిన రాజకీయం చేస్తుందని ఇలాంటి పనులు సరికాదని..ప్రతిపక్షంపై జగన్ మండిపడ్డారు.
