టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్ర బడ్జెట్‌పై మరోసారి స్పందించారు. రైల్ సర్వీస్ రాలేదు,కొత్త రైల్వే లైన్ లేదు, కొత్త రైల్వే లైన్ల కోసం సర్వే లేదు,బులెట్ట్ రైల్ లేదు,హై స్పీడ్ రైలు లేదు..అసలు బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావనే లేదని ట్వీట్ చేశారు. తెలంగాణకు బడ్జెట్‌లో నో అనే పదం తప్ప కేటాయింపులు జరగలేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులే లేదు బుల్లెట్ …హై స్పీడ్ రైల్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ,మిషన్ కాకతీయలను నీతి అయోగ్ మెచ్చుకుందని అలాంటి ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే కనీసం 24 రూపాయలు కూడా కేటాయించలేదని గతంలో మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేల ప్రస్తావన రాకపోవడంతో ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్.
No new Rail service
No new Rail line
No survey for a new line
No Bullet Rail
No Hi-speed Rail
No budgetary enhancement for ongoing Rail projectsThat word “NO” sums up allocations in budget for Telangana ?
Guess south of India is undeserving of Bullet Rail & Hi-speed Rail ?
— KTR (@KTRTRS) July 11, 2019