Home / 18+ / నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు

నాకు నేనుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా.. నీలా కాదు చంద్రబాబు

తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఏపని కావాల్సివచ్చినా తాను వెళ్తేనే సీఎంగా ఉన్న చంద్రబాబు పనిచేసేవారని, ఇప్పుడు అలా కాదని తాను ప్రజలకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకునేందుకు వైయస్ఆర్ సున్నావడ్డీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చిన ఘనత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.84వేలకోట్ల పంట రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. రైతులు సకాలంలో డబ్బులు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్ అందిచే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. పగటిపూట 9గంటలు నాణ్యమైన విద్యుత్ అందించబోతున్నట్లు సీఎం తెలిపారు. వచ్చే జూన్ నాటికి 40శాతం ఫీడర్లలో కూడా పగటి పూటే 9గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఆక్వారైతులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందజేస్తున్నట్లు జగన్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి వారిని ఆదుకుంటున్నామని, ఈ పథకం వల్ల రూ.720 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతున్నా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు తిరగకముందే మరో కొత్త పథకం అందుబాటులోకి తెచ్చామని, వైయస్ఆర్ ఉచిత పంటభీమా పథకం ద్వారా రాష్ట్రంలో 55లక్షలమంది రైతులకు కోటి రూపాయలు పైగా ఇన్సూరెన్స్ చేయించినట్లు సీఎం స్పష్టం చేశారు.

అలాగే రైతుల ధరకు మద్దతు కల్పించేందుకు రూ.3వేల కోట్లతో రైతు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయిల్ పామ్ రైతులకు మద్దతుధర కల్పించి వారికి మరింత చేదోడుగా నిలిచామని, తెలంగాణలో ఆయిల్ పామ్ రేటు వేయిరూపాయలు కంటే ఎక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉందని ధరలు పెంచాలని గత ప్రభుత్వాన్ని మెుత్తుకున్నా వినలేదని అందుకే తమప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్దతు ధర కల్పిస్తూ రూ.80కోట్లు విడుదల చేసామని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ చంద్రబాబు చెప్తే చేయలేదని జగన్ అన్నారు. తనకు తానుగా రైతులకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టు జగన్ వెల్లడించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat