చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ పదేపదే ప్రశ్నించింది. దీంతో చంద్రబాబుకు జగన్ కౌంటరిస్తూ తాను ముఖ్యమంత్రి అయి కేవలం నెలరోజులే అయిందన్నారు. కానీ అప్పటివరకూ మీరే సీఎంగా ఉన్నారు కదా.. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ జగన్ సమాధానమిచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అందుకే కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నానని, అందుకే కాళేశ్వరం ఓపెనింగ్ కి తాను వెళ్లానన్నారు. తాను వెళ్లినా వెళ్లకపోయినా కాళేశ్వరం ఓపెన్ అవుతుందన్నారు.
