కడప జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పొలం పనులు చేస్తుండగా అప్పటికే భూమిలో పాతి ఉంచిన నాటు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. జమ్మలమడుగు పరిధిలోని మైలవరం మండలం రామచంద్రాయపల్లి గ్రామంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పొలంలో జేసీబీతో పనులు చేయిస్తుండగా.. ఓ బకెట్ వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న యువకుడు సోమశేఖర్.. ఆ బకెట్లో ఏముందని పరిశీలించే లోగా.. అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన సోమశేఖర్‌ను కడప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాటు బాంబులను అక్కడ ఎవరు పాతిపెట్టారు? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
