రానున్న దసరా కానుకగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.. బుధవారం రాత్రి ఆయన తన నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను 2014 వరకు అధికారంలో ఉండి కూడా పూర్తి చేయలే చేయలేదన్నారు.
కనీసం అనుమతులు కూడా తీసుకు రాలేదని అటవీ క్లియరెన్స్లు లేకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.. ఇలాంటి ప్రాజెక్టును కేవలం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చిత్తశుద్ధితో పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయనున్నట్లు ఆయన వివరించారు..
అధికారంలో ఉండి ఏం చేయలేక పోయినా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ఏ విధంగా పూర్తి చేసిందో అదే చిత్తశుద్ధితో చిన్న కాలేశ్వరంను సైతం పూర్తి చేస్తున్నట్లు వివరించారు.. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుపారు..ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈలు మదన్మోహన్, భాస్కరాచారి, మెగా ప్రాజెక్టు మేనేజర్ పాపిరెడ్డి, మంథని ఎంపీపీ కొండ శంకర్ సింగిల్విండో చైర్మన్ ఎకేటి అనంతరెడ్డి, ఏ ఈలు హరికృష్ణ వెంకటిలు పాల్గొన్నారు.
Post Views: 338