ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ కారణమంటూ సోషల్
మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ధోనీ కాదు అంట. ఈ విషయం గురించి టీమిండియా మాజీ కెప్టెన్లు గంగూలీ,ద్రావిడ్,సీనియర్ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్
చెబుతున్నారు. అందులో భాగంగా ప్రపంచ కప్ సెమిస్లో భారత్ ఓటమికి కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయమే ప్రధాన కారణం అని వారు అంటున్నారు. అంతేకాకుండా వారు ఇంకా మాట్లాడుతూ”ధోనీని ఏడో నెంబర్లో
బ్యాటింగ్ కు పంపించడమే అతిపెద్ద తప్పు. ఇదే కొంపముంచిందని వారు అంటున్నారు. గతంలో చివరి ఓవర్లల్లో కార్తిక్,పాండ్యా,జడేజా అద్భుతంగా రాణించారు. వాళ్లను చివరిలో పంపించకుండా ధోనీని పంపించాలని
తీసుకున్న నిర్ణయమే అతిపెద్ద తప్పు అని వారంటున్నారు..
