రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడ కు తగిన ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో తెలంగాణ టిన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ లోగో ను మంత్రి శ్రీనివాస్ గౌడ్,చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ క్రీడకు విశేష ప్రాచుర్యం కల్పిస్తామన్నారు. కొత్తగా రాష్ట్రంలో టిన్ పిన్ బౌలింగ్ అసోసియేషన్ ను ఏర్పాటు చేయటం ఆనందం గా ఉందన్నారు. అసోసియేషన్ ద్వారా టిన్ పిన్ బౌలింగ్ క్రీడను క్రీడాకారులకు మరింత చేరువ చేసేందుకు కృషిచేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో వివిధ రకాలైన టౌర్నమెంట్ల నిర్వహణ తో పాటు, క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి టౌర్నమెంట్ల కు చేరువ చేసేందుకు అసోసియేషన్ ప్రతినిధులు కృషిచేయాలన్నారు.
