ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ ప్రకటించారని వార్త వచ్చింది. పాతికేళ్లుగా తాను పార్టీలో ఉన్నానని, ఇంతకాలం తనను ప్రోత్సహించినవారికి , ఆదరించినవారికి దన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఆత్మ ప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సతీశ్ ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు?భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ఇంకా తెలపలేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారంటే బహుశా అదికార వైసిపి వైపు చూస్తున్నారా?లేక బిజెపిలో చేరతారా అన్నది తేలవలసి ఉంది. ఎక్కువగా వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
