ప్రస్తుతం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు ఒకే ఒక్క ఓవరు వేయడానికి మాములుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది. స్పిన్నర్లు అయితే మూడు నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే టీమ్
ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం కేవలం రెండు అంటే రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేసుంటాడు. అయితే నిన్న మంగళవారం ప్రపంచ కప్ లో భాగంగా కివీస్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో ఒకే ఒక్క
నిమిషం ముప్పై ఒక్క సెకన్లలోనే ఒక ఓవర్ పూర్తి చేశాడు జిడ్డు. అయితే వన్డే మ్యాచ్లో ఇంత తక్కువ వ్యవధిలోనే ఓవర్ పూర్తి చేయడం చాలా అనూహ్యమే.
