తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యింది.. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా దారుణ ఓటమిని మూట కట్టుకుంది. టిడిపి ఘోరపరాజయం ఎదురైన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా టీడీపీలో గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలంతా మరో పార్టీని వెతుక్కుంటున్నారు. వైసీపీలోకి వస్తే పదవులకు రాజీనామా చేసి రావాలనేది ఆపార్టీ సిద్దాంతం దీంతో చేసేది లేక పదవులను వదులుకుని ఎన్నికలకు వెళ్లలేక చాలామంది బీజేపీవైపు చూస్తున్నారు. మొత్తం గెలిచిన 23మంది ఎమ్మెల్యేలలో 19మంది బీజేపీలోకి వెళ్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఓడిపోయినవారిలో సుమారుగా 40 నుంచి 60మంది వైసీపీకి సంబంధించి ఆయా జిల్లాల నేతలు ఒప్పుకుంటే జగన్ పార్టీలోకి చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఇప్పట్లో కోలుకోలేదని ఆపార్టీ నేతలే చెప్తున్నారు. ఇదే జరిగితే ఆపార్టీ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంటే రాష్ట్రం మొత్తమ్మీద టీడీపీ క్యాడర్, నాయకులు మొత్తం చేజారిపోతే, కార్యర్తల శాతం కూడా క్యాడర్ తోపాటు వెళ్లిపోవడం వల్ల గణనీయంగా తగ్గిపోతుంది. దాంతో పార్టీ మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది.. అందుకే ఈ వలసలను నియంత్రించేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలే ఓటమిబాధ నుండి ఇంకా బయటపడని చంద్రబాబును వదిలి నేతలంతా వెళ్లిపోతేయ మూలిగే నక్కపై తాటిపండు పడినట్టవుతుంది.. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి ఫిరాయించారు. మాజీ ఎమ్మెల్యేలు బిజెపిలోకి వెళ్లిపోయారు. ఇంకొందరు వైసిపిలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు పాలనలో జగన్ మంచి దూకుడుమీదున్నారు. ఇంకోవైపు నిలదొక్కుకునేందుకు బిజెపి ప్లాన్లు వేస్తోంది. ఇన్ని సమీకరణాలతో వైసీపీ, బీజేపీ, జనసేన తర్వాత స్థానానికి టీడీపీ పడిపోయినా ఆశ్చర్యం లేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
