ప్రస్తుతం దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభం దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీమ్ కోర్టుకు చేరింది. సర్కారుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తమ
రాజీనామాలను ఆమోదించకుండా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజ్యంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా
విచారించాలని వారంతా సీజేఐ ముందు ప్రస్తావించగా రేపు పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది
