నవ్యాంధ్ర యువ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నమోదైన రికార్డుల ప్రకారం 1500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ పరిహారం 315 మందికే మాత్రమే ఇచ్చారని రికార్డులు చెబుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. అందువల్ల రైతుల కుటుంబాలకు నష్టం జరగింది.వారికి కూడా పరిహారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు.ఈ మిగిలిన రైతులందరికి ఏడు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.అందులో భాగంగా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ ,ఎమ్మెల్యేలు ఆ రైతు కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలని సీఎం తెలిపారు.
