తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రూ.10కోట్లు మంజూరు చేసింది. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చింతమడక గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి రూ.10కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ చింతమడకకు రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.