గతంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో బొల్లినేనిపై ఈ దాడులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. ఇప్పటివరకు కోట్లరూపాయల అక్రమాస్తులను సీబీఐ గుర్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బొల్లినేని శ్రీనివాస్గాంధీ అత్యంత సన్నిహితుడు. అధిక ఆదాయం కలిగి ఉన్నారన్న కారణంతోనే ఈకేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో ఆయనపై సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. బొల్లినేని నివాసంతోపాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ప్రస్తుతం జీఎస్టీ సీనియర్ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది.. ఈయన గతంలో జగన్ ఎదుర్కొన్న ఈడి కేసులో దర్యాప్తు అధికారిగా పని చేసారు. జగన్ కేసు దర్యాప్తు సందర్బంగా గాంధీ తీసుకున్న నిర్ణయాలతో జగన్, జగన్ భార్య భారతిని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. దీని పై జగన్ నేరుగా ప్రధానికి ఫిర్యాదు చేయటంతో గాంధీని ఈడీ నుండి జీఎస్టీకి బదిలీ చేశారు. అయనపై అప్పట్లోనే ఈడీ, కేంద్ర ఆర్థికశాఖ మరియు పీఎంవోకు ఎన్నో ఫిర్యాదులు అందాయి. కాగా, గాంధీ మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఈయన పదేళ్లకు పైగా అయన ఈడీశాఖలో పనిచేశారు. దీనితో చంద్రబాబు ఇతని ఉద్యోగ, ఆర్ధికాభివృద్ధికి తోడ్పడ్డారు. అవకాశం వచ్చినపుడు జగన్ ని అనవసరంగా ఇబ్బందులకు గురిచేసారు. ఈ క్రమంలో అక్రమ ఆస్తులు కూడా సంపాదించుకున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా కీలక శాఖల్లోని ఉన్నతాధికారుల పై కేంద్రం దృష్టి సారించడంతో బొల్లినేని గాంధీ వ్యవహారం బట్టబయలైంది. వ్యవస్థలను వాడుకుని చంద్రబాబు మెప్పుకోసం జగన్ ని ఇబ్బందులు పెట్టాడు.. ఇప్పుడు అదే వ్యవస్థలకు బలైపోయాడంటూ గాంధీపై విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలను అడ్డుపెట్టుకుని అడ్డదారులు తొక్కితే దేవుడు చూడకుండా ఉంటారా అంటూ గాంధీ, చంద్రబాబులనుద్దేశించి అంటున్నారు.
